బస్సు నడుపుతుండగా అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో క్వాలిస్‌ను ఢీకొట్టిన డ్రైవర్
- అదుపు తప్పిన బస్సు
- దెబ్బతిన్న వాహనాల ముందు భాగాలు
- ప్రయాణికులకు స్వల్ప గాయాలు
దీంతో బస్సు అదుపుతప్పి డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న క్వాలిస్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో క్వాలిస్ 100 మీటర్ల దూరం దూసుకెళ్లి సైడ్ వాల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు, క్వాలిస్ ముందు భాగాలు దెబ్బతిన్నాయి. బస్సులోని కొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్‌కు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.