మోహన్ బాబుకు బెయిల్ మంజూరు.. 30 రోజుల్లోగా డబ్బు చెల్లించాలంటూ ఆదేశం

  • చెక్ బౌన్స్ కేసులో మోహన్ బాబుకు ఏడాది జైలు శిక్ష
  • 30 రోజుల్లోగా డబ్బు చెల్లిస్తానన్న మోహన్ బాబు
  • బెయిల్ మంజూరు చేసిన కోర్టు
మోహన్ బాబుకు హైదరాబాదులోని ఎర్రమంజిల్ కోర్టు షాకిచ్చిన సంగతి తెలిసిందే. చెక్ బౌన్స్ కేసులో ఆయనకు ఏడాది జైలు శిక్షను విధించింది. రూ. 41.75 లక్షలను చెల్లించాలంటూ ఆదేశించింది. ఈ మొత్తాన్ని చెల్లించకపోతే జైలు శిక్షను మరో మూడు నెలలు పొడిగిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో, మోహన్ బాబు తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్ ను కోర్టులో దాఖలు చేశారు. 30 రోజుల్లోగా ఈ మొత్తాన్ని చెల్లిస్తామని కోర్టుకు తెలిపారు. దీంతో, మోహన్ బాబుకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 30 రోజుల్లోగా దర్శకనిర్మాత వైవీఎస్ చౌదరికి డబ్బును చెల్లించాలని ఆదేశించింది.
Go Back to Shorts
mohan babu
cheque bounce
bail
tollywood

More Telugu News