చెక్ బౌన్స్ కేసులో మోహన్ బాబు కు ఏడాది జైలు శిక్ష
- చెక్ బౌన్స్ కేసు వేసిన వైవీఎస్ చౌదరి
- 2010లో కేసు వేసిన వైవీఎస్
- ఏ1 లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, ఏ2 మోహన్ బాబు
సినీ దర్శకనిర్మాత వైవీఎస్ చౌదరి మోహన్ బాబుపై ఈ చెక్ బౌన్స్ కేసును వేశారు. 2010లో ఈ అంశానికి సంబంధించి కోర్టును ఆశ్రయించారు. 'సలీం' సినిమా సందర్భంగా వైవీఎస్ చౌదరికి మోహన్ బాబు రూ. 40.50 లక్షల చెక్కును ఇచ్చారు. ఈ చెక్ నగదుగా మారకపోవడంతో వైవీఎస్ కోర్టులో కేసు వేశారు. కేసులో ఏ1గా లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, ఏ2గా మోహన్ బాబు ఉన్నారు. కోర్టు తీర్పుతో మోహన్ బాబు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు, ఈ అంశంపై మంచు ఫ్యామిలీ ఇంత వరకు స్పందించలేదు.