మోహన్ లాల్ నుంచి 'లూసిఫెర్' .. 4 రోజుల్లో 50 కోట్లు
- మోహన్ లాల్ హీరోగా 'లూసిఫెర్'
- అన్ని ప్రాంతాల్లోను భారీ వసూళ్లు
- అభిమానుల్లో ఆనందం
పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ సినిమా వసూళ్ల పరంగా తన జోరును కొనసాగిస్తూనే వుంది. వివేక్ ఒబెరాయ్ .. మంజు వారియర్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. మోహన్ లాల్ నుంచి ఇంతకుముందు వచ్చిన 'ఒడియన్' .. పరాజయంపాలు కావడంతో డీలాపడిన ఆయన అభిమానులు, 'లూసిఫెర్' సక్సెస్ తో ఖుషీ అవుతున్నారు.