Wikipedia: బాలీవుడ్ నటి ఊర్మిళ పేరు మార్చేసిన ఆకతాయిలు!

  • 2015లో మొహసీన్ అక్తర్ మిర్ ను పెళ్లి చేసుకుంది
  • ఆమె పేరు మరియమ్ అక్తర్ మిర్ గా మారింది
  • ఊర్మిళ ప్రొఫైల్ పేజీలో ఆకతాయిలు చేసిన పని!
ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన బాలీవుడ్ నటి ఊర్మిళా మతోంద్కర్ ను ఆకతాయిలు ఆటపట్టించారు. వికీపీడియాలో ఉన్న ఊర్మిళకు సంబంధించిన వివరాలను ఆకతాయిలు పూర్తిగా మార్చేశారు. ఊర్మిళ మతం, ఆమె తల్లిదండ్రుల వివరాలను మార్చేశారు. 2015లో కశ్మీర్ కు చెందిన వ్యాపారవేత్త మొహసీన్ అక్తర్ మిర్ ను ఆమె పెళ్లి చేసుకుందని, ఆ తర్వాత ఊర్మిళ పేరు మరియమ్ అక్తర్ మిర్ గా మార్చుకున్నట్టు ఆమె ప్రొఫైల్ పేజీలో ఆకతాయిలు మార్చారు.  దీనిపై ఊర్మిళ కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. ఆకతాయిచేష్టలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ‘వికీపీడియా’ అధికారులను ఊర్మిళ తండ్రి శ్రీకాంత్ కోరారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం ‘వికీపీడియా’లో ఊర్మిళా మతోంద్కర్ ప్రొఫైల్ పేజీలో ఆమె పేరు ఊర్మిళా మతోంద్కర్ గానే ఉంది. భర్త పేరు మాత్రం మొహసీన్ అక్తర్ మిర్ గానే ఉండటం గమనార్హం. కాగా, ఈ పనికి పాల్పడింది బీజేపీ సోషల్ మీడియా విభాగమని, ఇలాంటి ప్రచారాలకు పాల్పడటం తగదంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. 
Wikipedia
Bollywood
urmila matondkar
congress

More Telugu News