కేసీఆర్ మాట్లాడుతున్న మాటలు హిందువులను కించపరిచేలా ఉన్నాయి!: డీకే అరుణ ఫైర్
- కేసీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి
- 13 మంది గెలిచినప్పుడు ఏం చేశారో చెప్పాలి
- బీజేపీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరు
కేసీఆర్ తాను 16 స్థానాలు గెలిచి ఏదో ఒరగబెడతానని అంటున్నాడని, ఆయన గతంలో 13 మంది గెలిచినప్పుడు ఏంచేశారో చెప్పాలని డీకే అరుణ ప్రశ్నించారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీనే మళ్లీ ప్రధాని అని స్పష్టం చేశారు. అరుణ నిన్నటివరకు కాంగ్రెస్ లో ప్రముఖ నేతగా కొనసాగారు. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ లోకి వలస వెళుతుండడంతో, ఆమె కూడా కీలక నిర్ణయం తీసుకుని బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆమె మహబూబ్ నగర్ ఎంపీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.