ఫినిష్.. చంద్రబాబు పార్టీ!: మోహన్ బాబు జోస్యం
- టీడీపీ అధికారంలోకొస్తే అన్నీ దోచేస్తారు
- నో మోర్ చంద్రబాబు పార్టీ
- ఎన్టీఆర్ కుటుంబంలోని వారు అమాయకులు
‘ఫినిష్ చంద్రబాబు పార్టీ, నో మోర్ చంద్రబాబు పార్టీ’ అని వ్యాఖ్యానించారు. ‘తెలుగుదేశాన్ని నమ్ముకున్న సోదరులారా! మళ్లీ మీకు ఈ టర్మ్ లేదు’ అని అన్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి బాగా చేయకపోతే ఇంకో టర్మ్ లో ఆ పార్టీకి అవకాశమొచ్చినా చంద్రబాబుకు మాత్రం వద్దని సూచించారు. అన్న ఎన్టీఆర్ కుటుంబంలోని వారు అమాయకులని, అందుకే, చంద్రబాబు వారిని మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఏపీ అభివృద్ధి కోసం కేంద్రం ఇచ్చిన నిధులను చంద్రబాబు దోచేశారని, లెక్కలు చెప్పకుండా తప్పించుకుంటున్న ‘దొంగ’ అని ఆరోపించారు.