విద్యుత్ బకాయిలు చెల్లించని వైసీపీ నేత ఆమంచి కంపెనీ.. కనెక్షన్ కట్ చేసిన ఏపీ విద్యుత్ శాఖ!
- ప్రకాశం జిల్లా వేటపాలెంలో క్రిస్టల్ సీఫుడ్స్ కంపెనీ
- రూ.1.30 కోట్ల మేర బకాయిలు చెల్లించని సంస్థ
- నోటీసులు ఇచ్చినా స్పందించని యాజమాన్యం
ఈ బిల్లులు చెల్లించాల్సిందిగా పలుమార్లు నోటీసులు జారీచేశామన్నారు. అయినా కంపెనీ యజమానులు, ప్రతినిధులు స్పందించకపోవడంతో నిబంధనల మేరకు విద్యుత్ కనెక్షన్ ను కట్ చేశామని పేర్కొన్నారు. ఈ విషయంలో నిబంధనల మేరకు ముందుకు పోతామని వ్యాఖ్యానించారు. కాగా, ఈ విషయమై ఆమంచి కృష్ణమోహన్, వైసీపీ వర్గాలు ఇంతవరకూ స్పందించలేదు.