Chandrababu: నీతిపరులను వెంటాడే పనికిరాని వ్యక్తి ఈ నరేంద్ర మోదీ: చంద్రబాబు ఫైర్

షార్ట్స్‌లో చూడండి
తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం ఎన్నికల ప్రచార సభలో సీఎం చంద్రబాబునాయుడు ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శల వర్షం కురిపించారు. ఇవాళ కర్నూలు సభలో మోదీ తనపై చేసిన వ్యాఖ్యల పట్ల బాబు స్పందించారు. అసలు ఎందుకొచ్చారు మీరిక్కడికి? అంటూ ప్రధానిని ప్రశ్నించారు. విభజన తాలూకు గాయాలు ఇంకా మానలేదని అన్నారు. మేం ఈ దేశంలో పౌరులం కాదా? మేం పన్నులు కట్టడం లేదా? కేంద్రం సహకరించకపోయినా, తెలంగాణ లక్ష కోట్ల వాటా ఇవ్వకపోయినా, ప్రజల సహకారంతో ముందుకెళతాం అంటూ సమరోత్సాహం ప్రదర్శించారు.

"నరేంద్ర మోదీగారూ మా ప్రజలు చెప్పేది వినండి! నేను చెప్పడం కాదు, మా ప్రజల నోటి వెంట వినండి, నేను చేసిన అభివృద్ధి ఏంటో. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఈ ఐదేళ్ల కాలంలో నాకొచ్చిన ఆనందం ఎప్పుడూ చూడలేదు. మీరు ఢిల్లీలో కానీ, తెలంగాణలో కానీ సంక్షేమ కార్యక్రమాలు ఏమైనా చేశారా? లేదే! మొన్న ఓ వృద్ధురాలు వేదికపైకి వచ్చి నా పెద్ద కొడుకు వచ్చాడు అంటూ మురిసిపోయింది. వృద్ధుల్లో కూడా ఆత్మవిశ్వాసం కలిగేలా సంక్షేమ పథకాలు తీసుకువచ్చాం, అధికారం, పెత్తనం తప్ప ఇవన్నీ నరేంద్ర మోదీకి అర్థంకావు. ఆయన చౌకీదార్ నంటూ ప్రజలను మోసం చేస్తున్నాడు. అవినీతిపరులకు కాపలాదారుడు. నీతిపరులను వెంటాడే ఈ నరేంద్ర మోదీ ఓ పనికిరాని వ్యక్తి" అంటూ ప్రసంగించారు.
Go Back to Shorts
Chandrababu
Narendra Modi

More Telugu News