నాగబాబుగారి వల్లనే 'జబర్డస్త్'కి నిండుదనం వచ్చింది: ముక్కు అవినాష్
Add ap7am to your home Screen

నాగబాబుగారి వల్లనే 'జబర్డస్త్'కి నిండుదనం వచ్చింది: ముక్కు అవినాష్

  • నాగబాబుగారు అందుకే రాలేదు 
  • 'జబర్దస్త్'కి జడ్జిగా ఆయనే వుంటారు
  •  ప్రేక్షకుల కోరిక కూడా అదే  
'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో 'ముక్కు అవినాశ్' ఒకరు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, నాగబాబును గురించి ప్రస్తావించాడు. "నాగబాబుగారు 'జబర్దస్త్' షో నుంచి వెళ్లిపోయినట్టుగా కొన్ని యూట్యూబ్ చానల్స్ వారు చెబుతున్నారు .. కానీ అలాంటిదేం లేదు. ఆ మధ్య ఆయనకి కాస్త ఫీవర్ గా ఉండటం వలన షూటింగుకి హాజరు కాలేకపోయారు.

'జబర్డస్త్' జడ్జి సీట్లో నాగబాబుగారు లేకపోతే ఏదో వెలితిగా ఉందనీ .. ఆయన వుంటేనే బాగుంటుందని చాలామంది కామెంట్స్ పెట్టారు. నిజంగానే ఆ సీట్లో నాగబాబు గారు ఉంటేనే కార్యక్రమానికి ఒక నిండుదనం వస్తుంది. ఆయన ఒక తండ్రిలా మాకు సలహాలు సూచనలు ఇస్తుంటారు. ఇంటి నుంచి భోజనం తెప్పించి అందరికీ ముద్దలు కలిపి పెడతారు. తాను ఓ మెగా బ్రదర్ ను అనే విషయం మరిచిపోయి మాలో కలిసిపోతారు .. అది మేం చేసుకున్న అదృష్టం" అని చెప్పుకొచ్చాడు.
avinash

More Telugu News