రాహుల్ చిన్నపిల్లాడు.. అతని వ్యాఖ్యలపై కామెంట్ చేయను!: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వెటకారం

  • మమత సర్కారుపై రాహుల్ విమర్శలు
  • రైతులు, నిరుద్యోగులకు ఏమీ చేయలేదని విమర్శ
  • రాహుల్ చిన్నపిల్లాడన్న మమత
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చిన్నపిల్లాడిగా అభివర్ణించారు. ఆయన చేసే విమర్శలపై తాను కామెంట్ చేయబోనని స్పష్టం చేశారు. ఈ నెల 23న రాహుల్ కోల్ కతాలో పర్యటిస్తూ, తృణముల్ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులు, రైతుల సంక్షేమానికి చేసింది ఏమీ లేదని విమర్శించారు. మమతా బెనర్జీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఎండగట్టారు. తాజాగా ఈ విషయమై మీడియా ప్రశ్నించడంతో మమతా బెనర్జీ స్పందిస్తూ, ‘చిన్నపిల్లాడు ఏదో అన్నాడు. దానిపై నేను కామెంట్ చేయను’ అని వెటకారంగా స్పందించారు.
Go Back to Shorts
Rahul Gandhi
Congress
West Bengal
mamata
benerji
Chief Minister
tmc

More Telugu News