ప్రేమకథా చిత్రాల నుంచి హారర్ థ్రిల్లర్ కథల వైపుకు ఈషా రెబ్బా
Add ap7am to your home Screen

ప్రేమకథా చిత్రాల నుంచి హారర్ థ్రిల్లర్ కథల వైపుకు ఈషా రెబ్బా

  • యూత్ హృదయాలను దోచేసిన ఈషా రెబ్బా
  • హారర్ థ్రిల్లర్ కథకి గ్రీన్ సిగ్నల్ 
  • త్వరలోనే సెట్స్ పైకి
తెలుగు తెరకు పరిచయమైన తెలుగు అమ్మాయిలలో ఈషా రెబ్బా ఒకరు. సౌందర్య .. స్నేహ తరువాత చక్కని నవ్వుతో కుర్రకారు హృదయాలను దోచేసిన కథానాయికగా ఈషా రెబ్బా కనిపిస్తుంది. ప్రేమకథా చిత్రాలను చేస్తూ వస్తున్నప్పటికీ, ఈషా రెబ్బాకి అనుకున్న స్థాయిలో క్రేజ్ రాలేదనే చెప్పాలి. ఆ క్రేజ్ ను అందుకునే పాత్రలు కూడా ఆమెకి పడలేదు.

అలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తోన్న ఈషా రెబ్బా, తాజాగా ఒక హారర్ థ్రిల్లర్ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. 'ఢమరుకం' ఫేమ్ శ్రీనివాసరెడ్డి హారర్ థ్రిల్లర్ గా సాగే ఒక కథను సిద్ధం చేసుకుని ఇటీవల ఈషా రెబ్బాకి వినిపించాడట. ఆ కథ ఆమెకి నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని అంటున్నారు. నాయిక ప్రాధాన్యత కలిగిన సినిమా కావడం కూడా ఆమె అంగీకరించడానికి మరో కారణమని చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
eesha rebba

More Telugu News