కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన గోపీచంద్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన గోపీచంద్

  • వరుస పరాజయాలు 
  • విజయం కోసం నిరీక్షణ 
  • చేతిలో మూడు ప్రాజెక్టులు     
'పంతం' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఏడాది కావొస్తున్నా, గోపీచంద్ నుంచి ఇంతవరకూ మరో సినిమా రాలేదు. వరుస పరాజయాలు పలకరిస్తూ ఉండటంతో, మంచి కథ కోసం వెయిట్ చేస్తూ ఆయన గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం ఒక సినిమా చేస్తోన్న ఆయన, సంపత్ నందితో మరో సినిమాను కూడా ప్లాన్ చేస్తున్నాడు.

అంతేకాదు తాజాగా ఒక కొత్త దర్శకుడు వినిపించిన కథకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. బిను సుబ్రహ్మణ్యం వినిపించిన కథ కొత్తగా అనిపించడంతో గోపీచంద్ ఓకే చెప్పడం జరిగిందని అంటున్నారు. గతంలో గోపీచంద్ తో 'సాహసం' సినిమా చేసిన భోగవల్లి ప్రసాద్ .. ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. జూన్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
gopichand

More Telugu News