Rajasthan: కుమార్తె పెళ్లికి ఏర్పాట్లు పూర్తి చేసిన వెంకటేశ్!

షార్ట్స్‌లో చూడండి
తన కుమార్తె అశ్రిత వివాహానికి సంబంధించిన ఏర్పాట్లను విక్టరీ వెంకటేశ్ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. రాజస్థాన్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ ను ప్లాన్ చేసిన వెంకీ, ఈ వివాహానికి సన్నిహితులు, బంధువులను మాత్రమే ఆహ్వానించారని తెలుస్తోంది. హైదరాబాద్ రేస్ క్లబ్ యజమాని సురేందర్ రెడ్డి మనవడితో అశ్రిత నిశ్చితార్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వారంలోనే వీరిద్దరి వివాహం జరుగనుండగా, సంగీత్ లో రానా దగ్గుబాటి, నాగ చైతన్య, సమంత తదితరులు సందడి చేయనున్నారని, పెళ్లి తరువాత హైదరాబాద్ లో ఘనంగా రిసెప్షన్ ఉంటుందని దగ్గుబాటి వర్గాలు చెబుతున్నాయి.
Go Back to Shorts
Rajasthan
Venkatesh
Ashrita
Marriage

More Telugu News