ఈ ఇరవై రోజులు ఓ సోల్జర్ లా పనిచేస్తా: టీడీపీ నాయకురాలు దివ్యవాణి

  • ప్రజల కోసం కష్టపడటాన్ని జన్మధన్యమైనట్టుగా భావిస్తా
  • ఇష్టంతో పనిచేస్తున్నా అందుకే కష్టంగా అనిపించట్లేదు
  • టీడీపీ వల్లే  ఏపీ అభివృద్ధి సాధ్యం
వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేత రోజాపై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, సినీనటి దివ్యవాణి ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ వల్లే  ఏపీ అభివృద్ధి సాధ్యమని, తెలుగు రాష్ట్ర ప్రజల కోసం కష్టపడటం వల్ల తన జన్మధన్యమైనట్టుగా భావిస్తున్నట్టు చెప్పారు. టీడీపీకి తాను కొత్త అమ్మాయిని అయినప్పటికీ తనను బాగా ప్రోత్సహిస్తున్నారని అన్నారు. తెలుగు రాష్ట్రం, ఇక్కడి ప్రజలు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని, ఇష్టంతో పనిచేస్తున్నాను కనుక తనకేదీ కష్టంగా అనిపించడం లేదని స్పష్టం చేశారు. ఈ ఇరవై రోజులు ఓ సోల్జర్ లా పనిచేస్తానని, తెలుగు రాష్ట్ర ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
Tollywood
Divya vani
Telugudesam

More Telugu News