Andhra Pradesh: జనసేన ఆఫీసులో క్లీనింగ్ చేసేందుకు కూడా రెడీ అని చెప్పా.. కానీ పవన్ గొప్ప గౌరవం ఇచ్చారు!: నాగబాబు

షార్ట్స్‌లో చూడండి
పవన్ కల్యాణ్ గురించి జనసేన కార్యకర్తల కంటే తనకే ఎక్కువ తెలుసని మెగాబ్రదర్ నాగబాబు అన్నారు. పవన్ కల్యాణ్ ను తాను చిన్నప్పటి నుంచి చూశాననీ, ఆయన ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉండేవారని తెలిపారు. అలాంటప్పుడు ‘ఏం చేస్తున్నావ్ కల్యాణ్?’ అని ఇంట్లో ఎవరైనా ప్రశ్నిస్తే జవాబు చెప్పేవాడు కాదన్నారు. పవన్ కల్యాణ్ సమక్షంలో ఈరోజు జనసేనలో చేరిన అనంతరం నాగబాబు మీడియాతో మాట్లాడారు.

పవన్ కల్యాణ్ పేరుకే తనకు తమ్ముడనీ, నిజానికి సాధారణ జనసేన కార్యకర్తల్లాగే తనకూ పవన్ నాయకుడని వ్యాఖ్యానించారు. పార్టీలో చేరకముందే ఎలాంటి బాధ్యత అప్పగించినా అంకితభావంతో పనిచేసేందుకు సిద్ధమయ్యానని తెలిపారు. జనసేన కార్యాలయంలో తనకు క్లీనింగ్ పని ఇచ్చినా చేసేందుకు రెడీ అని చెప్పానన్నారు.

కానీ తనను నరసాపురం లోక్ సభ అభ్యర్థిగా నిలబెట్టి పవన్ గొప్ప గౌరవం ఇచ్చారన్నారు. పవన్ కల్యాణ్ ఇచ్చిన స్ఫూర్తి, బలం, ధైర్యంతోనే ఇటీవల తాను మాట్లాడానని స్పష్టం చేశారు. తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు పవన్ కల్యాణ్ కు నాగబాబు కృతజ్ఞతలు చెప్పారు.
Go Back to Shorts
Andhra Pradesh
Jana Sena
Pawan Kalyan
nagababu

More Telugu News