Sahoo: ‘సాహో’ భామ పెళ్లి పీటలెక్కబోతోందట!

  • ఓ ఫోటో గ్రాఫర్‌‌తో డేటింగ్‌లో ఉన్న శ్రద్ధా
  • 2020లో శ్రద్ధ వివాహం
  • ఇప్పటికే తన ఇంట్లో వాళ్లని ఒప్పించిన రోహన్
‘సాహో’ హీరోయిన్ శ్రద్ధా కపూర్ పెళ్లి పీటలెక్కబోతోందట. ఓ ఫోటోగ్రాఫర్‌‌తో కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న శ్రద్ధా ఆయన్నే వివాహం చేసుకోబోతోందని తెలుస్తోంది. శ్రద్ధ కపూర్ రోహన్ శ్రేష్ట అనే ఫోటోగ్రాఫర్‌తో చాలా కాలంగా డేటింగ్‌లో ఉందని తెలుస్తోంది. 2020లో శ్రద్ధ అతన్ని వివాహం చేసుకుని స్థిరపడాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే పెళ్లి చేసుకోవాలంటూ ఆమెపై ఇంట్లో వాళ్లు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. రోహన్ ఇప్పటికే తన ఇంట్లో వారికి చెప్పి పెళ్లికి ఒప్పించినట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే 2020లో శ్రద్ధా, రోహన్ పెళ్లి పీటలెక్కుతారు.
Sahoo
Sradha Kapoor
Dating
Rohan Sreshta
Photographer

More Telugu News