Telugudesam: చంద్రబాబు అలా అంటుంటే ‘ఫ్యాన్’ గాలి వీస్తోందని ప్రజలకు వినిపిస్తుంది: విజయసాయిరెడ్డి

షార్ట్స్‌లో చూడండి
అలెగ్జాండర్ కు పది లక్షల సైనికులుంటే, తనకు 65 లక్షల సైన్యం ఉందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కటింగులిస్తున్నాడంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా చేసిన వరుస ట్వీట్లలో చంద్రబాబుపై విమర్శలు, ఆరోపణలు చేశారు. కొట్టేసిన 3.75 కోట్ల మంది వ్యక్తిగత వివరాలు కూడా బాబు వద్ద ఉన్నాయని ఆరోపించిన విజయసాయిరెడ్డి, తెలుగుదేశం గాలి వీస్తోందని చంద్రబాబు ఇంకోసారి అనొద్దని, ఆయన అలా అంటుంటే, ‘ఫ్యాన్’ గాలి వీస్తోందని  ప్రజలకు వినిపిస్తుందని వ్యాఖ్యానించారు. ముప్పై ఐదేళ్లుగా చంద్రబాబు పులివెందుల అబ్సెషన్ తో బాధపడుతున్నారని సెటైర్లు విసిరారు. పద్నాలుగేళ్లు సిఎంగా ఉండి కూడా ఈ ఫోబియా నుంచి బయట పడలేక పోయారేమిటి ‘తుప్పు నాయుడు గారూ?’ అంటూ బాబును ప్రశ్నించారు. అర్థంలేని భయాలను ప్రజలకు అంటించాలని చూస్తున్న చంద్రబాబు, మంచి డాక్టర్ ను కలిసి ట్రీట్మెంట్ తీసుకోవాలంటూ సెటైర్లు విసిరారు.  





Go Back to Shorts
Telugudesam
Chandrababu
YSRCP
vijayasai reddy

More Telugu News