జూలై 30, 2020... సినిమా విడుదల తేదీ... ఇప్పట్లో ఫస్ట్ లుక్, టీజర్ లుండవ్: రాజమౌళి
Add ap7am to your home Screen

జూలై 30, 2020... సినిమా విడుదల తేదీ... ఇప్పట్లో ఫస్ట్ లుక్, టీజర్ లుండవ్: రాజమౌళి

  • 10 భాషల్లో విడుదల కానున్న 'ఆర్ఆర్ఆర్'
  • సినిమా విడుదలకు చాలా సమయం ఉంది
  • ఇప్పుడే ఫస్ట్ లుక్ టూ ఎర్లీ అవుతుందన్న రాజమౌళి
'ఆర్ఆర్ఆర్' సినిమాను వచ్చే సంవత్సరం జూలై 30వ తేదీన దేశవ్యాప్తంగా 10 భాషల్లో విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ నెలలో రామ్ చరణ్ పుట్టిన రోజు, మే నెలలో తారక్ పుట్టినరోజులు ఉన్న సందర్భంగా, సినిమాలో వారి లుక్స్, టీజర్స్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయా? అన్న ప్రశ్నకు రాజమౌళి సమాధానం చెప్పారు. సినిమాను వచ్చే సంవత్సరమే విడుదల చేస్తామని, సినిమా విడుదలకు చాలా సమయం ఉన్నందున టీజర్ లు, ఫస్ట్ లుక్ లు ఉండబోవని స్పష్టం చేశారు. ఇప్పుడే వాటిని విడుదల చేయడం టూ ఎర్లీ అవుతుందన్నారు. ఆ వెంటనే తారక్ కల్పించుకుంటూ, "అక్కడో మార్చి, మే వున్నాయి కదాండి" అనడంతో ఆడిటోరియంలో నవ్వులు పూశాయి.
Rajamouli
RRR]
NTR
Ramcharan

More Telugu News