సైనిక త్యాగాలను ప్రచారానికి వాడుకోకండి: రాజకీయ పార్టీలకు ఈసీ ఆదేశం
- పోస్టర్లపై సైనికుల ఫొటోలు ఉంచరాదని సూచన
- పైలట్ అభినందన్ ఫొటో వినియోగించిన బీజేపీ నేత
- తన దృష్టికి రావడంతో స్పందించిన ఎన్నికల సంఘం
దేశవ్యాప్తంగా అభినందన్‌తో ఉన్న హోర్డింగ్‌లు, బ్యానర్లు ఏర్పాటుచేసి అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఇదే అదనుగా ఓ బీజేపీ సీనియర్ నాయకుడు తయారు చేయించుకున్న హోర్డింగ్‌లో అభినందన్ ఫొటో వాడారు. ఈ హోర్డింగ్ కాస్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లుకొట్టి వైరల్‌గా మారడంతో ఎన్నికలు సంఘం దృష్టికి వెళ్లింది. దీనిపై స్పందించిన ఈసీ సైనికుల ఫొటోలు వాడరాదంటూ ఆదేశాలు జారీ చేసింది.