Mahesh Babu: మండుటెండల్లో 'మహర్షి' షూటింగ్

షార్ట్స్‌లో చూడండి
ప్రస్తుతం మహేశ్ బాబు .. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' సినిమా చేస్తున్నాడు. మహేశ్ బాబుకి ఇది 25వ సినిమా కావడం వలన, సంఖ్యా పరంగా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది.అప్పుడే ఎండలు మండిపోతున్నాయి .. ఈ మండుటెండలను కూడా లెక్కచేయకుండా, 'మహర్షి' సంబంధించిన చిత్రీకరణ అవుట్ డోర్లో జరుగుతోంది. ఎంతో అంకితభావంతో ఈ సినిమా టీమ్ పనిచేస్తోంది. ఈ సినిమా షూటింగు జరుగుతోన్న లొకేషన్ నుంచి మహేశ్ బాబు కొన్ని ఫొటోలను షేర్ చేశాడు. ఎండల కారణంగా .. మహేశ్ బాబు షాట్ గ్యాప్ లో వెంటనే నీడకి వచ్చేస్తున్నట్టుగా ఈ స్టిల్స్ ను బట్టి తెలుస్తోంది. అశ్వనీదత్ .. దిల్ రాజు .. పీవీపీ నిర్మిస్తోన్న ఈ సినిమాలో, అల్లరి నరేశ్ ఒక కీలకమైన పాత్రను చేస్తోన్న విషయం తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను, మే 9వ తేదీన విడుదల చేయనున్నారు.
Go Back to Shorts
Mahesh Babu
vamsi paidipalli

More Telugu News