మహేశ్ .. అనిల్ రావిపూడి సినిమాలో సాయిపల్లవి?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహేశ్ .. అనిల్ రావిపూడి సినిమాలో సాయిపల్లవి?

  • కథానాయికగా సాయిపల్లవికి మంచి క్రేజ్
  • మహేశ్ సినిమా కోసం సంప్రదింపులు
  •  సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్        
తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో కథానాయికగా సాయిపల్లవికి మంచి క్రేజ్ వుంది. కథ .. కథనాల్లో కొత్తదనం ఉంటేనే సాయిపల్లవి ఏ ప్రాజెక్టుకైనా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అందువల్లనే ఆమె ఖాతాలో వైవిధ్యభరితమైన సినిమాలు ఎక్కువగా కనిపిస్తాయి. మహేశ్ బాబు 26వ సినిమాలో ఆమె నటించే అవకాశాలు ఎక్కువగా వున్నాయనే వార్త ఫిల్మ్ నగర్లో జోరుగా వినిపిస్తోంది.

ప్రస్తుతం మహేశ్ బాబు తన 25వ సినిమాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' చేస్తున్నాడు. తన 26వ సినిమాను ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఒక కథానాయికగా సాయిపల్లవిని తీసుకోవాలనే ఉద్దేశంతో అనిల్ రావిపూడి ఉన్నాడనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా లైన్ ఆమెకి వినిపించడానికి అనిల్ రావిపూడి చెన్నైకి వెళ్లినట్టుగా చెప్పుకుంటున్నారు. అలాగే సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ ని ఎంచుకున్నారని, ఆయనను కూడా కలిసి లైన్ చెప్పేసి వస్తాడని అంటున్నారు. 
Mahesh Babu
saipallavi

More Telugu News