హిందీ సినిమాను ఒప్పేసుకున్న కీర్తి సురేశ్?
- అందాల కథానాయికగా పేరు
- తమిళంలోనూ మంచి క్రేజ్
- బోనీకపూర్ బ్యానర్ నుంచి ఆఫర్
ఇంతకుముందు హిందీలో 'బధాయి హో'తో హిట్ కొట్టేసిన అమిత్ శర్మ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తాడట. ఈ సినిమాను బోనీకపూర్ నిర్మించనున్నట్టు సమాచారం. ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ కావడంతో, చాలా మంది కథానాయిల పేర్లను పరిశీలించారట. చివరికి కీర్తి సురేశ్ అయితే బాగుంటుందని భావించి ఆమెను సంప్రదించడం .. ఆమె ఓకే చేయడం జరిగిపోయిందని అంటున్నారు. ఈ సినిమాలో తన రోల్ ఛాలెంజింగ్ గా ఉండటంతోనే కీర్తి సురేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పుకుంటున్నారు.