‘బిగుస్తున్న ‘క్యూ నెట్' ఉచ్చు.. బాలీవుడ్, టాలీవుడ్ సినీ ప్రముఖులకు నోటీసులు!
- షారూక్, బోమన్ ఇరానీ, పూజా హెగ్డేకు నోటీసులు
- టాలీవుడ్ నటుడు అల్లు శిరీష్ కు కూడా
- వారం రోజుల్లోగా పోలీసుల ఎదుట హాజరు కావాలంటూ ఆదేశాలు
నోటీసులు అందుకున్న ప్రముఖులందరూ వారం రోజుల్లోగా పోలీసుల ఎదుట హాజరు కావాలని, లేనిపక్షంలో వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆ నోటీసుల్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. కాగా, మొత్తం ఐదు వందల మందికి సైబరాబాద్ పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ‘క్యూ నెట్’కు ప్రచారం చేసి కస్టమర్లను ఆకర్షించేలా చేసిన వారు కూడా నేరస్తులేనని పోలీసులు అంటున్నారు. ‘క్యూ నెట్’ ద్వారా లబ్ధి పొందిన వారిని కూడా విచారణకు పోలీసులు పిలిచినట్టు సమాచారం.