Pakistan: భారత్ వైమానిక దాడి ఇచ్చిన ఆనందాన్ని వినూత్నంగా పంచుకున్న ఆటోవాలా!

షార్ట్స్‌లో చూడండి
ఇటీవలే పుల్వామాలో భారత జవాన్లపై జరిగిన ఉగ్ర‌దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌లోని ఉగ్ర‌శిబిరాల‌ను భార‌త వైమానిక దళం ధ్వంసం చేసింది. దీంతో దేశమంతా హర్షం వ్యక్తం చేస్తోంది. తమ ఆనందాన్ని దేశ ప్రజలు ఒక్కొక్కరూ ఒక్కోలా పంచుకుంటున్నారు. ఢిల్లీలో మనోజ్ అనే ఆటోవాలా మాత్రం తన ఆనందాన్ని వినూత్నంగా పంచుకున్నాడు. నేడు తన ఆటోలో ఎక్కిన కస్టమర్లను ఉచితంగా గమ్య స్థానాలకు చేర్చాడు.

తన ఆటోకి ప్రయాణం ఉచితం అనే బోర్డు కూడా తగిలించాడు. ఈ సందర్భంగా మనోజ్ మీడియాతో మాట్లాడుతూ.. 'నా అనందాన్ని ఇంతకంటే బాగా ఎలా పంచుకోగలను. అందుకే నా ఆటోలో ఎక్కే ప్రతి ఒక్కరినీ ఫ్రీగా తిప్పుతున్నాను. ఎవరి దగ్గరా డబ్బులు తీసుకోలేదు. పాక్‌ ఉగ్ర శిబిరాలపై భారత్ దాడులు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఒక్కరోజు ఎవరి దగ్గరా డబ్బులు తీసుకోను' అని తెలిపాడు.
Go Back to Shorts
Pakistan
Pulwama
Manoj
Delhi
Auto
Monery

More Telugu News