16 గంటల ఆపరేషన్ సక్సెస్.. బోరు బావిలో పడ్డ చిన్నారిని సురక్షితంగా బయటకు తీసిన అధికారులు!
- మహారాష్ట్రలోని పూణేలో ఘటన
- నిన్న ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయిన బిల్
- అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన చిన్నారి తల్లిదండ్రులు
రాత్రంతా బోరు బావిలోకి ఆక్సిజన్ పంపుతూ సమాంతరంగా గొయ్యిని తవ్వారు. అనంతరం పిల్లాడిని సురక్షితంగా బయటకు తీశారు. మరోవైపు తమ కుమారుడు సురక్షితంగా బయటపడటంతో పిల్లాడి తల్లిదండ్రులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం పిల్లాడు ఆరోగ్యంగా ఉన్నాడనీ, ఎలాంటి గాయాలు కాలేదని వైద్యులు అన్నారు.