Telangana: సీఎం కేసీఆర్ నాకిచ్చిన బాధ్యతను నెరవేరుస్తా: మంత్రి తలసాని

షార్ట్స్‌లో చూడండి
సీఎం కేసీఆర్ తనకు ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తానని తెలంగాణ కొత్త మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాజ్ భవన్ లో మంత్రిగా ఈరోజు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం, మీడియాతో మాట్లాడుతూ, దేశం గర్వపడేలా కేసీఆర్ పాలన సాగిస్తున్నారని ప్రశంసించారు. కార్యకర్తల రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేమని, సామాన్యకార్యకర్తగా ప్రజలకు సాయం అందిస్తానని అన్నారు. తెలంగాణలోని సంక్షేమ పథకాలు తలెత్తుకునేలా ఉన్నాయని కొనియాడారు. ఈ సందర్భంగా ఇటీవల ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ గురించి తలసాని ప్రస్తావిస్తూ, బడ్జెట్ లో హైదరాబాద్ కు ఎక్కువ నిధులు కేటాయించారని, ఆ నిధులను సక్రమంగా వినియోగించుకుందామని అన్నారు.
Go Back to Shorts
Telangana
cm
kcr
minister
talasani

More Telugu News