పాక్ తో వరల్డ్ కప్ ఆడకున్నా ఏం కాదంటున్న హర్భజన్ సింగ్!
- పాక్ తో మ్యాచ్ ని బహిష్కరించాలి
- భద్రతా దళాలకు జాతి అండగా నిలవాలి
- మరే ఇతర క్రీడను కూడా ఆడవద్దన్న సింగ్
ఆటలకంటే దేశమే ముఖ్యమన్న సంకేతాన్నిస్తూ, జూన్ 16న పాక్ తో జరగాల్సిన వన్డే మ్యాచ్ ని బహిష్కరించాలని సూచించాడు. క్రికెట్ సహా హాకీ, కబడ్డీ వంటి మరే ఇతర క్రీడలనూ పాక్ తో ఆడరాదని అన్నాడు. వరల్డ్ కప్ లో భాగంగా భారత జట్టు లీగ్ దశలోనే మిగతా అన్ని దేశాలతో ఆడనుండటం, ఆయా మ్యాచ్ ల ఫలితాలతోనే నాకౌట్ దశకు అవకాశం పొందనుండటంతో పాక్ తో మ్యాచ్ ని బహిష్కరించినా నాకౌట్ చాన్స్ లు తగ్గబోవని హర్భజన్ సింగ్ తెలిపాడు.