modi: మోదీ, కేసీఆర్ తో పాటు ట్రంప్ ను కూడా కలిపితే బాగుంటుందేమో!: టీడీపీపై అవంతి శ్రీనివాస్ సెటైర్లు

షార్ట్స్‌లో చూడండి
టీడీపీ నాయకులు వైసీపీలో చేరడం వెనుక ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ల ప్రమేయం ఉందంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలపై అవంతి శ్రీనివాస్ స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘మోదీకీ, కేసీఆర్ కు ఇంక పనేమీ లేదా? ఇదే పనా ఏంటీ? ట్రంప్ ను కూడా కలిపితే బాగుంటుందేమో. ఆకాశానికి, భూమికి లింక్ పెడతారు వాళ్లు (టీడీపీ నాయకులు). సరే, మీడియా చేతిలో ఉంది కాబట్టి నోటికొచ్చినట్టు ఏదైనా మాట్లాడొచ్చు’ అని విమర్శించారు.
Go Back to Shorts
modi
kcr
triump
Telugudesam
bjp
TRS
YSRCP

More Telugu News