Chandrababu: నాణ్యమైన జీవితం, ఆనందమయ నగర నిర్మాణమే లక్ష్యంగా అమరావతి నిర్మాణం: చంద్రబాబు
సింగపూర్‌ను మించిన నగరంలా అమరావతిని నిర్మిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నేడు నోవాటెల్ హోటల్‌లో హ్యాపీ సిటీ సమ్మిట్‌లో చంద్రబాబు పాల్గొన్నారు. మూడు రోజులపాటు జరగనున్న ఈ సమ్మిట్‌లో 30 దేశాల ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. నాణ్యమైన జీవితం, ఆనందమయ నగర నిర్మాణమే లక్ష్యంగా అమరావతి నిర్మాణం జరుగుతోందని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంతొో ప్రజలు ఉన్నత జీవన ప్రమాణాలతో జీవించవచ్చని చంద్రబాబు తెలిపారు.