ram: రామ్ తదుపరి చిత్రానికి దర్శకుడు ఖరారు

షార్ట్స్‌లో చూడండి
ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ 'ఇస్మార్ట్ శంకర్' సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. మాస్ ఆడియన్స్ కి నచ్చేలా రామ్ ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. పూరి సొంత బ్యానర్లో రూపొందుతోన్న ఈ సినిమాను మే నెలలో విడుదల చేయనున్నారు. దాంతో జూన్ నుంచి మరో ప్రాజెక్టుతో సెట్స్ పైకి వెళ్లేలా రామ్ ప్లాన్ చేసుకున్నాడు.

ఇటీవల ఆయనని దర్శకుడు సాగర్ చంద్ర కలిసి ఒక మంచి కథ చెప్పాడట. 'అప్పట్లో ఒకడుండేవాడు' సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఆయనకి, రామ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందట. కథాకథనాలు కొత్తగా ఉండటం వలన, వెంటనే రామ్ ఓకే చెప్పేశాడని అంటున్నారు. స్రవంతి మూవీస్ బ్యానర్ పై నిర్మితమయ్యే ఈ సినిమాలో నాయిక ఎవరు? ప్రతినాయకుడు ఎవరు? తదితర వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
Go Back to Shorts
ram
sagarchandra

More Telugu News