సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- బిజీగానే వున్నానంటున్న రకుల్
- రూటు మార్చిన నిత్యా మీనన్
- 'డిస్కోరాజా'కు సిద్ధమవుతున్న రవితేజ
* కథానాయిక నిత్యామీనన్ కి ఇటీవలి కాలంలో అవకాశాలు తగ్గడంతో, ఇప్పుడు వెబ్ సీరీస్ లో నటించడానికి ఓకే చెప్పింది. అమెజాన్ ప్రైం 'బ్రీత్ సీజన్ 2'లో నాయికగా నటిస్తుంది. ఇందులో అభిషేక్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
* రవితేజ హీరోగా నటించే 'డిస్కో రాజా' చిత్రం రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల 4 నుంచి హైదరాబాదులో జరుగుతుంది. వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాభా నటేశ్, పాయల్ రాజ్ పుట్, ప్రియాంక జువాల్కర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.