ఆరోగ్యం బాగుండాలంటే సైకిల్ తొక్కాలి.. ఏపీ బాగుండాలంటే 'సైకిల్'నే తొక్కాలి!: టీడీపీపై నాగబాబు సెటైరికల్ స్కిట్
Add ap7am to your home Screen

ఆరోగ్యం బాగుండాలంటే సైకిల్ తొక్కాలి.. ఏపీ బాగుండాలంటే 'సైకిల్'నే తొక్కాలి!: టీడీపీపై నాగబాబు సెటైరికల్ స్కిట్

  • టీడీపీ గుర్తుపై మెగాబ్రదర్ సెటైరికల్ వీడియో
  • ఇద్దరు చిన్నారులతో స్కిట్ విడుదల
  • ఓ సైకిల్ కంపెనీకి యాడ్ చేశామని వివరణ
తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ పై మెగాబ్రదర్ నాగబాబు ఈరోజు ఫన్నీ స్కిట్ ను విడుదల చేశారు. మై ఛానల్ నా ఇష్టం ఛానల్ లో ఈరోజు స్పందిస్తూ.. ‘ఆరోగ్యం బాగుండాలంటే సైకిల్ తొక్కాలి. ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే సైకిల్ నే తొక్కాలి.మర్చిపోరు కదా. థ్యాంక్యూ’ అని తెలిపారు.

అలాగే ఈ వీడియో విషయమై మాట్లాడూతూ ..‘అన్నట్లు ఇందులో చూపిన వాహనం ఏ వ్యక్తికీ సంబంధించింది కాదు. ఓ సైకిల్ కంపెనీకి మేమిచ్చిన యాడ్ ఇది’ అంటూ ముగించారు. ఈ ఫన్నీ వీడియోను మీరూ చూసేయండి.
Andhra Pradesh
Telugudesam
cycle
skit
nagababu
funny video

More Telugu News