చంద్రబాబు గ్రీన్ సిగ్నల్... పచ్చ కండువా కప్పుకోనున్న కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్!
- గతంలో ఐదుసార్లు లోక్ సభకు ఎన్నికైన చంద్రదేవ్
- ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా
- త్వరలోనే తెలుగుదేశంలో చేరే అవకాశం
కాగా, అరకు ప్రాంతంలో బలమైన పార్టీ అభ్యర్థి కోసం ఎదురుచూస్తున్న తెలుగుదేశం నేతలు ఇప్పటికే కిశోర్ చంద్రదేవ్ తో చర్చించినట్టు తెలుస్తోంది. ఆయన్ను ఆహ్వానించాలని చంద్రబాబు చేసిన సూచన మేరకు సీనియర్ నేతలు చంద్రదేవ్ ను కలవగా, ఆయన కూడా సంసిద్ధత వ్యక్తం చేసినట్టు సమాచారం. వాస్తవానికి అరకు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లో వచ్చిన సీట్లు నామమాత్రమే. అరకు, పాడేరులో వైసీపీ అభ్యర్థులే గెలిచారు. ఆపై మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వారు టీడీపీలో చేరగా, చంద్రదేవ్ రాకతో పార్టీ మరింతగా బలపడుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. కాగా, తాను టీడీపీలో చేరే విషయమై కిశోర్ చంద్రదేవ్ ఇప్పటివరకూ ఎటువంటి అధికారిక ప్రకటనా చేయలేదు. తాను త్వరలోనే ఈ విషయమై తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని మాత్రమే ఆయన అన్నారు.