పదేపదే ప్రియుడితో పారిపోతున్న కుమార్తెను దారుణంగా చంపిన తండ్రి!
- ప్రకాశం జిల్లా తాళ్లూరు సమీపంలో ఘటన
- ప్రియుడితో పారిపోతే ఇంటికి తెచ్చిన తండ్రి
- వాదోపవాదాలు పెరిగి హత్య!
పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన కోట వెంకటరెడ్డికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. రెండో కుమార్తె వైష్ణవి (20), ఒంగోలులోని ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ చదువుతోంది. రోజూ కాలేజీ బస్సులో వెళ్లే ఆమె, లింగసముద్రం ప్రాంతానికి చెందిన యువకుడిని ప్రేమించింది. గత గురువారం నాడు, బస్సులో ఇంటికి వస్తూ, ఆసుపత్రికి వెళుతున్నానని చెప్పిన ఆమె, ప్రియుడితో కలిసి తిరుపతికి వెళ్లింది.
ఈ విషయం తెలుసుకున్న తండ్రి, ఆమెను తిరిగి తీసుకువచ్చి నచ్చజెప్పాడు. ఆ మరుసటిరోజే స్నానం చేసి వస్తానని అంటూ వెళ్లి, మరోమారు పరారైంది. ఈ దఫా ఆమె, మార్కాపురం ప్రాంతంలో ఉందని తెలిసి మళ్లీ తెచ్చారు. నలుగురూ కలిసి మంచి చెప్పబోతే, వైష్ణవి రెచ్చిపోయింది. నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే, వెంకటరెడ్డి ఆగ్రహం కట్టలుతెచ్చుకుంది. ఆమెపై చెయ్యిచేసుకున్నాడు.
ఈ క్రమంలో నిన్న తెల్లవారుజామున, తన కుమార్తె ఆరోగ్యం బాగాలేదంటూ, స్థానిక ఆర్ఎంపీ వైద్యుడిని పిలిపించగా, ఆప్పటికే ఆమె మరణించింది. ముఖంపై గాయాలు, ఆమె గొంతు నులిమి ఉన్నట్టు కనిపించడంతో, ఆమె హత్యకు గురైందన్న కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.