'వాల్మీకి' సినిమాలో ఈషా రెబ్బా?
- హరీశ్ శంకర్ నుంచి 'వాల్మీకి'
- ప్రధాన పాత్రల్లో వరుణ్ తేజ్ ..శ్రీ విష్ణు
- ఆల్రెడీ నానుతోన్న రష్మిక పేరు
తమిళంలో బాబీసింహా చేసిన పాత్ర కోసం 'వరుణ్ తేజ్' ను ఎంపిక చేసుకున్నాడు. ఇక సిద్ధార్థ్ చేసిన పాత్రకిగాను శ్రీవిష్ణును తీసుకున్నాడు. కథానాయికగా రష్మిక మందన పేరును పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఈషా రెబ్బా పేరు తెరపైకి వచ్చింది. ఈ మధ్య ఆమె చేసిన 'బ్రాండ్ బాబు' .. 'సుబ్రహ్మణ్య పురం' ఆశించినస్థాయిలో ఆదరణ పొందలేదు. అలాంటి ఈషా రెబ్బ పేరే గట్టిగా వినిపిస్తోంది. మరి రష్మిక .. ఈషా రెబ్బలలో ఎవరిని అవకాశం వరిస్తుందనేది వేచి చూడాలి.