ఓడిపోయాను... తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వండి: ఇంటింటికీ తిరిగి ప్రాధేయపడుతున్న సర్పంచ్ అభ్యర్థి!
Add ap7am to your home Screen

ఓడిపోయాను... తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వండి: ఇంటింటికీ తిరిగి ప్రాధేయపడుతున్న సర్పంచ్ అభ్యర్థి!

  • అప్పులు చేసి పోటీపడి ఓడిపోయిన ఓ వ్యక్తి
  • రాజన్న సిరిసిల్ల జిల్లా, బస్వాపూర్ లో ఘటన
  • డబ్బిస్తున్న కొందరు, ససేమిరా అంటున్న మరికొందరు
"అప్పులు చేసి ఎన్నికల్లో పోటీ చేశాను. మీకు డబ్బిచ్చాను. కానీ, నాకు ఓట్లు పడలేదు. మీరెవరూ వేయలేదు. నేను ఇచ్చిన డబ్బులు వెనక్కు ఇవ్వండి" అంటూ ఇటీవలి తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ పడి ఓడిపోయిన ఓ అభ్యర్థి ఇంటింటికీ తిరుగుతూ ప్రాధేయపడుతున్నాడు.

 రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్‌ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌ గా పోటీచేసిన ఈ వ్యక్తి, పెద్దమొత్తంలో డబ్బు ఖర్చు పెట్టినా, విజయం సాధించలేదు. ఓడిపోయిన వెంటనే అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి రావడంతో, ఆయన ఇల్లిల్లూ తిరుగుతున్నారు. కొందరు గ్రామస్తులు మాత్రం ఆయన్నుంచి తీసుకున్న డబ్బులు వెనక్కు ఇస్తున్నారు. మరికొందరు మాత్రం తాము ఓటేశామని చెబుతూ, డబ్బు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారట.
Sarpanch
Elections
Telangana

More Telugu News