హరీశ్ శంకర్ కి రెండో హీరో కూడా దొరికేశాడు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హరీశ్ శంకర్ కి రెండో హీరో కూడా దొరికేశాడు

  • తెలుగులోకి రీమేక్ గా 'జిగర్తాండ'
  • పరిశీలనలో 'వాల్మీకి' టైటిల్ 
  • త్వరలోనే సెట్స్ పైకి వెళ్లేలా ప్లాన్
హరీశ్ శంకర్ ఈ సారి ప్రయత్నాలతోనే చాలాకాలం గడిపేశాడు. అనుకున్న ప్రాజెక్టులు ఆయా కారణాల వలన పట్టాలెక్కకపోవడంతో గ్యాప్ పెరిగిపోయింది. దాంతో సాధ్యమైనంత త్వరగా తన తాజా ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. 2014లో తమిళంలో విజయాన్ని సాధించిన 'జిగర్తాండ' సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి ఆయన రంగంలోకి దిగాడు.

ఈ సినిమాకి 'వాల్మీకి' అనే టైటిల్ ను ఖరారు చేయాలనే ఆలోచనలో వున్నాడు. తమిళంలో బాబీసింహా చేసిన పాత్రలో మార్పులు చేసి .. వరుణ్ తేజ్ ను ఎంపిక చేసుకున్నాడు. ఇక తమిళంలో సిద్ధార్థ్ చేసిన పాత్రకి గాను శ్రీవిష్ణును తీసుకున్నాడనేది తాజా సమాచారం. ఇక హీరోయిన్స్ గా ఎవరిని తీసుకుంటాడో చూడాలి. 14 రీల్స్ సంస్థ నిర్మించే ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.
varun tej
sri vishnu

More Telugu News