పెరిగిన ‘హెరిటేజ్ ఫుడ్స్’ లాభాలు.. ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందన్న నారా బ్రాహ్మణి!
- 2018 చివరి త్రైమాసికంలో 618 కోట్ల ఆదాయం
- అందులో 20 కోట్ల నికర లాభం నమోదు
- 9 నెలల కాలంలో రూ.62.43 కోట్ల నికర లాభం
ఈ విషయమై హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి మాట్లాడుతూ..‘గత 9 నెలల కాలంలో మా నిర్వహణ లాభం చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగింది. ప్రస్తుతం అన్ని ప్రాంతాలు, మార్కెట్లలో మా ఉత్పత్తులకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. ఆదాయం పెంచుకునేందుకు కీలక ఉత్పత్తుల రంగంలో మరింత వాటా దక్కించుకోవాలని భావిస్తున్నాం’ అని తెలిపారు.