తెలంగాణలో టీఆర్ఎస్ కు పది సీట్లే.. కాంగ్రెస్ కు ఐదు!: టైమ్స్ నౌ - వీఎంఆర్ సర్వే
Add ap7am to your home Screen

తెలంగాణలో టీఆర్ఎస్ కు పది సీట్లే.. కాంగ్రెస్ కు ఐదు!: టైమ్స్ నౌ - వీఎంఆర్ సర్వే

  • తగ్గిన టీఆర్ఎస్ జోరు 
  • బీజేపీ, ఇతరులకు చెరొకటి
  • అంచనా ఫలితాలపై ఇంకా స్పందించని టీఆర్ఎస్
ఇప్పటికిప్పుడు తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరిగితే ఫలితాలు ఎలా వుండనున్నాయో టైమ్స్ నౌ - వీఎంఆర్ వేసిన అంచనాలు, అనూహ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా ఉన్నాయి. రాష్ట్రంలో 17 లోక్ సభ సీట్లుండగా, ఎన్నికలు జరిగితే 16 తమ పార్టీ గెలుస్తుందని, ఒకటి ఎంఐఎంకు దక్కుతుందని టీఆర్ఎస్ నేతలు బల్లగుద్ది చెబుతున్న సంగతి తెలిసిందే. కానీ టైమ్స్ నౌ - వీఎంఆర్ సర్వే మాత్రం టీఆర్ఎస్ కు 10 సీట్లు వస్తాయని, యూపీఏ (కాంగ్రెస్)కు 5 సీట్లు, ఎన్డీయే (బీజేపీ), ఇతరులకు ఒక్కో సీటు చొప్పున రావచ్చని అంచనా వేసింది. ఈ అంచనా ఫలితాలపై టీఆర్ఎస్ ఇంకా స్పందించలేదు.
Telangana
TRS
Lok Sabha
Elections

More Telugu News