సింగరేణి కార్మికుడిగా కనిపించనున్న విజయ్ దేవరకొండ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సింగరేణి కార్మికుడిగా కనిపించనున్న విజయ్ దేవరకొండ

  • విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా 'డియర్ కామ్రేడ్'
  • తదుపరి సినిమా క్రాంతిమాధవ్ తో 
  • నాయికలుగా రాశి ఖన్నా .. ఐశ్వర్య రాజేశ్
విజయ్ దేవరకొండ అభిమానులంతా ఇప్పుడు 'డియర్ కామ్రేడ్' సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ తన తరువాత సినిమాపై దృష్టిపెట్టేశాడు. కేఎస్ రామారావు నిర్మాణంలో .. క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కొత్తగూడెంలో జరుగుతోంది. సింగరేణి కార్మికుడిగా విజయ్ దేవరకొండపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు.

అయితే కథలో ఒక సందర్భంలో మాత్రమే ఆయన ఇలా కనిపిస్తాడని అంటున్నారు. అటు క్లాస్ ఆడియన్స్ .. ఇటు మాస్ ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించే కంటెంట్ తోనే ఈ సినిమాను రూపొందిస్తున్నారట. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ సినిమాలో రాశి ఖన్నా .. ఐశ్వర్య రాజేశ్ కథానాయికలుగా కనిపించనున్నారు. ఈ సినిమా తరువాత వెంకీ అట్లూరితో కలిసి విజయ్ దేవరకొండ సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా సమాచారం. 
vijay devarakonda
rasi khanna
aishwarya rajesh

More Telugu News