ఆమె నా చెల్లిలాంటిది.. దురుద్దేశంతో చేయలేదు: సిద్ధరామయ్య
- మహిళ చేతినుంచి మైక్ లాక్కున్న సిద్ధరామయ్య
- ఊహించని విధంగా ఆయన చేతిలోకి వచ్చిన మహిళ చున్నీ
- దురుద్దేశంతో తాను ఆ పని చేయలేదన్న సిద్ధరామయ్య
తనపై వచ్చిన ఆరోపణలపై సిద్ధరామయ్య స్పందించారు. తాను ఎలాంటి దురుద్దేశంతో ఆ పని చేయలేదని ఆయన తెలిపారు. పొరపాటున అది జరిగిపోయిందని చెప్పారు. ఆమె 15 ఏళ్లుగా తనకు తెలుసని... తన సోదరి వంటిదని అన్నారు. ఆమె సుదీర్ఘంగా మాట్లాడుతుండగా... ఆమెను ఆపే ప్రయత్నం చేశానని... అప్పుడు పొరపాటున ఆ సంఘటన జరిగిందని చెప్పారు. దీన్ని అనవసరంగా వివాదం చేయవద్దని కోరారు.