ఫలించిన కవిత ప్రయత్నాలు.. ఈ రాత్రికి ఢిల్లీ చేరుకోనున్న తెలంగాణ ఖైదీలు
Add ap7am to your home Screen

ఫలించిన కవిత ప్రయత్నాలు.. ఈ రాత్రికి ఢిల్లీ చేరుకోనున్న తెలంగాణ ఖైదీలు

  • ఇరాక్ జైళ్లలో మగ్గుతున్న 14 మంది తెలంగాణ ఖైదీలు
  • కవిత చొరవతో వారిని విడుదల చేసిన ఇరాక్ ప్రభుత్వం
  • ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి స్వస్థలాలకు చేరుకునేలా ఏర్పాట్లు
టీఆర్ఎస్ ఎంపీ కవిత చేసిన ప్రయత్నాలు ఫలించాయి. జైళ్లలో మగ్గుతున్న 14 మంది తెలంగాణ ఖైదీలను ఇరాక్ ప్రభుత్వం విడుదల చేసింది. వీరంతా ఈ రాత్రికి ఢిల్లీకి చేరుకోనున్నారు. అక్కడి నుంచి తెలంగాణలోని తమ స్వస్థలాలకు చేరుకునేలా కవిత ఏర్పాట్లు చేశారు. ఇరాక్ నుంచి వస్తున్న ఖైదీలను రిసీవ్ చేసుకోవడానికి తెలంగాణ అధికారులు ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. వారిని రిసీవ్ చేసుకున్న తర్వాత వారి సొంత ఊళ్లకు పంపనున్నారు. మరోవైపు, కవిత చేసిన కృషిని పలువురు ప్రశంసిస్తున్నారు.
kavitha
TRS
iraq
telangana
prisoners
release

More Telugu News