'మిస్టర్ మజ్ను' దర్శకుడికి ఫుల్ డిమాండ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'మిస్టర్ మజ్ను' దర్శకుడికి ఫుల్ డిమాండ్

  • 'తొలిప్రేమ'తో తొలి హిట్ 
  • థియేటర్స్ లో 'మిస్టర్ మజ్ను'
  • పోటీ పడుతోన్న యువ హీరోలు      
'తొలి ప్రేమ' సినిమాతో తొలి ప్రయత్నంలోనే దర్శకుడు వెంకీ అట్లూరి విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత ఆయన చేసిన 'మిస్టర్ మజ్ను' ప్రస్తుతం థియేటర్స్ లో వుంది. ఈ సినిమా టేకింగ్ విషయంలో వెంకీ అట్లూరి మరిన్ని మార్కులు సంపాదించుకున్నాడు. ఆయనతో సినిమా చేయడానికి మైత్రీ మూవీ మేకర్స్ వారు సన్నాహాలు చేసుకుంటున్నారు.

ఈ సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండ చేయనున్నాడని తెలుస్తోంది. విజయ్ దేవరకొండతో వెంకీ అట్లూరి కథా చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు తరువాత వెంకీ అట్లూరి .. నాగ చైతన్యతో ఒక సినిమా చేయనున్నట్టు సమాచారం. తన కోసం ఒక మంచి కథను సిద్ధం చేయమని చైతూ అడిగినట్టు చెబుతున్నారు. ఇక నితిన్ .. నాగశౌర్య కూడా ఆయనతో సినిమా చేయడానికి ఉత్సాహాన్ని చూపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇలా యంగ్ హీరోలు పోటీ పడుతుండటంతో, వెంకీ అట్లూరికి ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది. 
venky atluri

More Telugu News