USA: ప్రేయసి పిలిచిందని వెళ్లాడు... సరదాగా గొడవ పడితే చంపేసింది!

షార్ట్స్‌లో చూడండి
లవర్ ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిస్తే ఎవరైనా ఆగుతారా? రెక్కలు కట్టుకుని వాలిపోరూ?... అలానే వెళ్లాడో యువకుడు. కానీ, అదే తనకు ఆఖరి రోజు అవుతుందని అనుకోలేదు. ప్రియుడిని ఇంటికి రమ్మని చెప్పిన ప్రియురాలు, అతను సరదాగా గొడవపడితే, సీరియస్ గా తీసుకుని కాల్చి చంపిన ఘటన అమెరికాలోని హోస్టన్ డౌన్ టౌన్ లో కలకలం రేపింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఆస్కార్ అల్వరాడో (17) అనే యువకుడు, అనాబెల్ లోపెజ్ (17) అనే యువతి ప్రేమలో ఉన్నారు. అనాబెల్ ఫోన్ చేసి ఆహ్వానించగా, ఆస్కార్ ఆమె ఇంటికి వెళ్లాడు. ఆమె అదే పనిగా ఫోన్ చూస్తూ, తనను పట్టించుకోకపోవడంతో విసుక్కున్నాడు. ఆమె నీళ్లు తాగేందుకు వెళితే, ఆటపట్టిద్దామని ఫోన్ ను దాచేశాడు. ఆమె తిరిగి వచ్చి ఫోన్ కోసం వెతుక్కుంటుంటే, నవ్వాడు. ఆమెకు కోపం వచ్చి అతనితో గొడవ పడింది.

పక్కనే ఉన్న గన్ తీసుకుని గురిపెట్ట, 'ఫోన్ ఇవ్వకపోతే కాల్చేస్తా' అంది. అతనూ సరదాగా తీసుకున్నాడు. ఆమె షూట్ చేసింది. తుపాకీ గుండు అతని భుజంలోంచి గుండెల్లోకి దూసుకెళ్లింది. ఆ శబ్దం విన్న పక్కింటి వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వచ్చేసరికి ఆస్కార్‌ రక్తపు మడుగులో పడివున్నాడు. అతన్ని ఆసుపత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. అయితే, తాను ఆ తుపాకీలో గుళ్లు లేవనుకున్నానని, ఆస్కార్‌ ను చంపాలని భావించలేదని అనాబెల్ అంటోంది. ఆమెపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
Go Back to Shorts
USA
Houston
Lover
Gun

More Telugu News