మరోసారి విజయ్ తో జోడీ కడుతోన్న కీర్తి సురేశ్
Add ap7am to your home Screen

మరోసారి విజయ్ తో జోడీ కడుతోన్న కీర్తి సురేశ్

  • విజయ్ తో చేసిన 'సర్కార్' హిట్
  • కీర్తి సురేశ్ ను ఎంపిక చేసిన అట్లీ
  • మరో కథానాయికగా నయనతార    
తెలుగు .. తమిళ భాషల్లో కీర్తి సురేశ్ అగ్రకథానాయికగా దూసుకుపోతోంది. తాజాగా ఆమె విజయ్ సినిమాలో మరోసారి ఛాన్స్ కొట్టేయడం విశేషం. 'సర్కార్' సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న విజయ్, తన తదుపరి సినిమాను అట్లీ కుమార్ దర్శకత్వంలో చేస్తున్నాడు. నిన్ననే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి.

'తేరి' .. 'మెర్సల్' వంటి భారీ విజయాల తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమా ఇది. ఈ సినిమాలో ఒక కథానాయికగా నయనతారను ఎంపిక చేశారు .. మరో కథానాయికగా కీర్తి సురేశ్ ను తీసుకున్నారనేది తాజా సమాచారం. మూడవ కథానాయికకి కూడా ఛాన్స్ వున్నట్టుగా తెలుస్తోంది. 'సర్కార్' లో విజయ్ సరసన అలరించిన కీర్తి సురేశ్, ఆ తరువాత సినిమాలోనే విజయ్ జోడీ కడుతుండటం విశేషం. క్రీడల నేపథ్యంలో జరిగే రాజకీయాలపై ఈ సినిమా కొనసాగుతుందని అంటున్నారు. ఈ సినిమాలో నయనతార .. కీర్తి సురేశ్ పాత్రలు ఎలా ఉంటాయనేది తెలియాల్సి వుంది.
vijay
keerthi suresh

More Telugu News