రాజకీయ ప్రక్షాళన పవన్ కల్యాణ్ తోనే సాధ్యం.. అందుకే జనసేనలో చేరబోతున్నా!: బీజేపీ ఎమ్మెల్యే ఆకుల
- ఈ నెల 21న పవన్ సమక్షంలో పార్టీలో చేరుతా
- పవన్ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తా
- రాజమండ్రిలో మీడియాతో బీజేపీ నేత
2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ పొత్తులో భాగంగా సత్యనారాయణ బీజేపీ టికెట్ పై గెలుపొందారు. ఆయన త్వరలోనే బీజేపీని వీడి జనసేనలో చేరుతారని గతకొంతకాలంగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఆకుల సత్యనారాయణ భార్య జనసేన పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నారు.