తెలంగాణ స్పీకర్‌గా పోచారం ఫైనల్.. నేడు ప్రకటించనున్న కేసీఆర్
- అనుభవం, బాగా మాట్లాడడంలో పోచారం నేర్పరి
- ఆయనైతే సభను బాగా నడిపించగలరని అభిప్రాయం
- ఎన్నికను ఏకగ్రీవం చేయాలంటూ ప్రతిపక్ష నేతలకు కేసీఆర్ ఫోన్
అనుభవం, బాగా మాట్లాడడంలో నేర్పు ఉన్న పోచారం అయితే సభను సమర్థంగా నిర్వహించగలరన్న ఉద్దేశంతోనే కేసీఆర్ ఆయనవైపు మొగ్గు చూపినట్టు సమాచారం. ఇప్పటికే ఆరుసార్లు ఎన్నికైన పోచారం వచ్చే ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితే ఉంటే ఆయన కుమారుడికి సీటు ఇస్తానని కూడా సీఎం చెప్పినట్టు తెలుస్తోంది. స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవం చేయాలంటూ ప్రతిపక్ష నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్లు చేసి విజ్ఞప్తి చేశారు. సభాపతిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి సహకరించాలని కోరారు.