anushka: అనుష్క మూవీలో హాలీవుడ్ స్టార్ హీరో

షార్ట్స్‌లో చూడండి
హీరోను గురించి కలలు కంటూ పాటలు పాడుకునే పాత్రలను అనుష్క పక్కన పెట్టేసి చాలా కాలమైంది. హీరోతో సమానంగా కథా భారాన్ని మోస్తూ సక్సెస్ వైపు నడిపించగల సామర్థ్యం తనకి ఉందని ఆమె 'అరుంధతి' సినిమాతోనే నిరూపించేసింది. అలాంటి అనుష్క 'భాగమతి' తరువాత కథానాయిక ప్రాధాన్యత కలిగిన ఒక సినిమా చేయడానికి అంగీకరించింది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకి 'సైలెన్స్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.

ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ హీరో 'మైఖేల్ మాడ్సన్' కీలకమైన పాత్రలో కనిపించనున్నాడనేది తాజా సమాచారం. ఈ సినిమా ఎక్కువభాగం చిత్రీకరణ అమెరికాలో జరగనుంది. అక్కడి షూటింగులో ఆయన పాల్గొంటాడట. హాలీవుడ్ స్టార్ హీరో ఈ సినిమాలో చేయనున్నారనే విషయం ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేస్తోంది. కథా నేపథ్యం ఏమై ఉంటుందా అనే విషయంపై అందరూ ఆత్రుత చూపుతున్నారు.
Go Back to Shorts
anushka
madhavan

More Telugu News