Harish Rao: 40 మంది ఎమ్మెల్యేలతో కలసి హరీష్ రావు కాంగ్రెస్ లో చేరుతున్నారంటూ తప్పుడు ప్రచారం.. పోలీసులకు ఫిర్యాదు!

షార్ట్స్‌లో చూడండి
టీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు మరో 40 మంది ఎమ్మెల్యేలతో కలసి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ జనగామ టీఆర్ఎస్వీ నేతలు డీసీపీకి ఫిర్యాదు చేశారు. ప్రశాంత్ మణి అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా ఫేస్ బుక్ ద్వారా ఈ ప్రచారం చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న సదరు వ్యక్తిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరారు. 
Go Back to Shorts
Harish Rao
TRS
congress
joining

More Telugu News